భార్యపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై విజయవాడ నున్న రూరల్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కండ్రిక కాలనీకి చెందిన టి.గౌతమ్‌కు గిరిపురానికి చెందిన సుమ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా మద్యానికి బానిసైన గౌతమ్ భార్యను వేధిస్తున్నాడు. శనివారం రాత్రి కూడా తప్పతాగి వచ్చిన గౌతమ్ భార్యపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.