గత వైసీపీ భూకబ్జా పాలకులు అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి రైతులకు మంచి చేసిన ప్రభుత్వం ఎన్డీయే అని గిద్దలూరు ఎమ్ముల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు బేస్తవారపేట గ్రామ పంచాయతీ కార్యలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామి ప్రకారమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.
ఇదే విధంగా పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను ప్రారంభించడం హర్షనీయమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి అందులో భాగంగా బేస్తవాటపేట మండలానికి రూ.2.50 కోట్లు బేస్తవారపేట పంచాయతీకి రూ.93 లక్షలు నిధులు మంజూరు చేసిన ఘతన పవన్‌కల్యాణ్‌కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పార్వతి, తహసీల్దార్ జితేంద్ర, బుద్దుల ప్రేమానంద్, దూదెకుల సైదులు, పూనూరు భూపాల్‌రెడ్డి, సోరెడ్డి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.