ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa