తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను జంతువుల కొవ్వుతో కల్తీ చేయించిన జగన్ రెడ్డిని జైలుకు పంపాలని పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ అక్రమాలు చేసి కోట్లాది రూపాయల సొమ్మును దోచుకున్నారని ఆరోపణలు చేశారు. పరమ పవిత్రమైన తిరుమలలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు.