ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత అంతరాయం కలగకుండా చూడాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 07:16 PM

పెద్దమండ్యం మండలానికి నిరంతర విద్యుత సరఫరాకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. రెండేళ్ల క్రితం ముసలికుంట ప్రాంతం లో లోవోల్టేజీ సమస్య తీర్చడానికి విద్యుత సబ్‌స్టేషన నిర్మించారు. దీంతో ముసలికుంట బండ్రేవు, దిగువపల్లి మందలవారిపల్లి ప్రాంతంలో లోవోల్టేజీ సమస్య తీరింది. ఈ సబ్‌స్టేషన ముసలికుంట ప్రాంతాన్నే కాకుండా మండ లానికి కూడా నిరంతర విద్యుత సరఫరాకు ప్రధాన కేంద్రంగా మారనుంది. పెద్దమండ్యం, కలిచెర్ల, తురకపల్లి సబ్‌స్టేషనలతో పాటు ముసలికుంట సబ్‌స్టేషన నిర్మాణంతో సబ్‌స్టేషనల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా కలికిరి నుంచి వచ్చే మెయిన సప్లై లైన గుర్రంకొండ మీదుగా పెద్దమండ్యం మండలానికి విద్యుత సరఫరా జరుగుతోంది. అలాగే ములకలచెరువు మండలం బురకాయలకోట నుంచి మెయిన సప్లై తంబళ్లపల్లి మీదుగా గోపిదిన్నె వరకు విద్యుత సరఫరా జరుగుతోంది. కలికిరి, బురకాయలకోట విద్యుత సరఫరా మెయిన లైన్లులు పెద్దమండ్యం-తంబళ్ళపల్లె సరిహద్దులో ఆగింది. ఈ ప్రాంతంలో రెండు విద్యుత మెయిన సప్లై లైన్లు కలిపే టెక్నికల్‌ పనులు పూర్తి చేస్తే మండలంలో నిరంతర విద్యుత సరఫరాకు సాధ్యమవుతుందని గతంలో అధికారులు వెల్లడించారు. మండలంలో కలికిరి నుంచి విద్యుత సరఫరా అంతరాయం కలిగినపుడు బురకాయలకోట నుంచి, బురకా యలకోట నుంచి విద్యుత అంతరాయం కలిగినప్పు డు కలికిరి నుంచి విద్యుత సరఫరా జరుగుతోందని తెలిపారు. ట్రాన్సకో ఉన్నతాధాకారులు ఈ కార్యాచరణకు రూపుదాలిస్తే కరువు మండలమైన పెద్దమండ్యంకు నిరంతరం విద్యుత సరఫరాతో భూము లు సస్యశ్యామలమై ప్రజల జీవితాలలో వెలుగులు నిండుకుంటాయి. ట్రాన్సకో ఆధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొని నిరంతర విద్యుత సరఫరాకు కృషి చేయా లని మండల ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com