తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిన్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. "తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యం పవిత్రతను పునరుద్ధరించడానికి, భక్తుల సంక్షేమానికి శాంతి హోమం ఆగమోక్తంగా జరిగింది.
శాంతి హోమం నిర్వహించిన ఆచార్యపురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు సోమవారం సాయంత్రం 6 గంటలకు తమ ఇళ్లలో దీపారాధన చేస్తూ క్షమ మంత్రం పఠించగలరు"అని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. హోమం నిర్వహించిన ఆచార్యుల సూచనల మేరకు ఇవాళ సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు దీపారాధన చేస్తూ 'క్షమ మంత్రం' చదవాలి. 'ఓం నమో నారాయణాయ.. ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఓం నమో వేంకటేశాయ..' మంత్రాలను జపించి, స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందాలి.