ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల పవిత్రతను మంట కలిపారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 10:25 PM

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారని.. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. 


కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్‌కు వెళ్లిందన్నారు. తిరుమల పవిత్రతను మంట కలిపింది జగన్‌మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు జరిగాయన్నారు. కర్ణాటక నెయ్యి టెండర్‌ను ఎందుకు ధర్మారెడ్డి రద్దు చేశారని ప్రశ్నించారు. లడ్డూ గురించి ఇష్టానుసారం మాట్లాడడం ఇకనైనా మానుకోవాలన్నారు. సుప్రీంకోర్టు సమోటోగా లడ్డూ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com