ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి2 వార్డులో కృష్ణాపురం లో గల ప్రాంతాలలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కూన అప్పలనాయుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కే రాజ్యలక్ష్మి ప్రతినిధి కూన బానోజీరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వందరోజుల కూటమి సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ గోడపత్రికలు అంటించారు. టిడిపి నాయకులు జి నారాయణ రాంబాబు అయ్యప్ప సతీష్ పాల్గొన్నారు.