ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం గుంతకల్లు నియోజకవర్గంలోని మూడు చెరువులకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను తెచ్చి మాట నిలబెట్టుకున్నామని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బుధవారం పేర్కొన్నారు.
గుత్తిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే గుత్తికి పామిడి నుంచి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్య లేకుండా చూస్తామని పేర్కొన్నారు.