పరిగి మండలం బోరెడ్డిపల్లి గ్రామానికి సిసి రోడ్డు నిర్మాణం కోసం రూ.60లక్షలుతో బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.