బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృ తి చెందిన వానపల్లి రాజేష్(30) వయస్సుకు చిన్నవాడే అయినప్పటికీ కుటుంబానికి ఆయ న దిక్కు. చొప్పెల్ల గ్రామనివాసి అయిన రాజేష్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో కుటుంబ భారం ఆయన తీసుకుని సోదరి వివాహంచేశారు.అవివాహితుడైన రాజేష్ తల్లికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. రాజేష్ ఇటుకబట్టీ నిర్వహిస్తున్నాడు. కు టుం బ పెద్దదిక్కు కోల్పోవడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.