వచ్చే ఎన్నికల్లో యానాం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తానని లేకపోతే గుండు గీయించుకుంటానని చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు.
ఎవరు ఓడిపోతారో, ఎవరు ఊరు వదిలి వెళ్లిపోతారో త్వరలో తెలనుందన్నారు. తనపై మల్లాడి చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. పేకాట క్లబ్‌లతో, హెచ్ఆర్ స్కెర్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. మూడే ళ్లుగా యానాంలో ఎటువంటి అభివృద్ధి జరగకుండా మల్లాడి అడ్డుకుంటున్నారని అన్నారు. సీఎంతో సహా ఎవరు యానాం అభివృద్ధికి సహకరించడంలేదన్నారు.