తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట, పుల్లేటికుర్రు పంచాయతీ కార్యాలయంలో బిల్లు కలెక్టర్‌గా పనిచేస్తున్న పెండ్యాల సూర్యమోహన్(27) గుండెపోటుతో మంగళవారం మృతిచెందాడు. అమలాపురం మండలం భట్నవిల్లికి చెందిన సూర్యమోహన్ విధులు నిర్వహించేందుకు మోటార్‌సైకిల్‌పై పుల్లేటికుర్రు బయలుదేరాడు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో బంధువులు అమలాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మోహన్‌కు ఇంకా వివాహం కాలేదు. చిన్న వయ్యస్సులో ఉద్యోగం రావడం ఆనందంగా ఉన్న ఆ కుటుంబ సభ్యులు మోహన్ మృతితో విచారం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ జల్లి బాలరాజు, ఎంపీటీసీలు పబ్బినీడి రాంబాబు, కుసుమ వెంకటేష్, వడలి కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఉద్యో గులు సంతాపం వ్యక్తం చేశారు.