కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా తొలిజాబితాలో శ్రీకాకుళం జిల్లాకు రెండు కార్పొరేషన్ చైర్మన్లు, రెండు డైరెక్టర్ పదవులు లభించాయి. టీడీపీ శ్రేణులకు మూడు పదవులు, జనసేన నాయకుడికి ఒక పదవి దక్కింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం మండలానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు.. శీర రమణయ్యకు ‘ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్‌గా నియమించారు.