శ్రీకాకుళం జిల్లాతో అనుబంధమున్న తమ్మిరెడ్డి శివశంకర్ స్వగ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం పెద్దబుడ్డిడి గ్రామం. ఆయన ఉన్నత చదువు అభ్యసించి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా కొలువు సాధించారు. రెండు దశాబ్దాల కిందట ఆయన శ్రీకాకుళంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి.. వారు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన సహకారాన్ని అందించారు. ఐదేళ్లు సర్వీసు ఉంటుండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయనను ప్రభుత్వం ఇప్పుడు ‘ఆంధ్రప్రదేశ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజస్ డెవలప్మెంట్ కార్పొరేషన్’కు చైర్మన్‌గా నియమించింది. దీంతో జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.