స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రీడా సంబరాలు మంగళవారం ఆదోని మున్సిపల్ క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ముఖ్య అతిథి డిప్యూటీ ఈవో వెంకట రమణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ శాంత క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. సెల్‌ఫోన్‌ల వల్ల బుద్ది మాంధ్యం, మానసిక వైకల్యం ఏర్పడుతుందని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలతో ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలు వస్తాయన్నారు.
మొదటిరోజు బాలుర కబడ్డీ, కోకో, వాలీబాల్, చెస్, సెటిల్, బ్యాట్మెంటన్ పోటీలు హోరాహోరీగా సాగాయి. అండర్ 14 కబడ్డీలో ఆర్‌ఆర్ లేబర్ కాలనీ పురపాలక పాఠశాల విధ్యార్థులు విజేతలగా నిలిచారు. నేడు బాలికలకు అండర్ 14, అండర్ 17 కూడా పోటీలు ఉంటాయని నిర్వాకలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసులు, మున్సిపల్ హై స్కూల్ హెచ్‌ఎం మల్లికార్జున, నెహ్రూ మెమోరియల్ పాఠశాల హెచ్‌ఎం అలింసిద్ధికి, ఎస్‌జీఎఫ్ కోఆర్డినేటర్ నరసయ్య, రామన్న, ముజాహిద్, హుస్సేన్ పాల్గొన్నారు.