ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 20వ వార్డులో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు చేసిన మేలును వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ఆయన మాట్లాడుతూ. పింఛన్ రూ. 4 వేలకు పెంచామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని తెలిపారు.