ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎం. నాగేంద్ర అనే యువకుడు గురువారం విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తి వద్ద తన ద్విచక్ర వాహనాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు బాధితుడు నాగేంద్ర తెలిపారు. వడ్డీతో సహా డబ్బులు కట్టినప్పటికీ బండి ఇవ్వకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు.