వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస రెడ్డి భారీ బల ప్రదర్శనతో జనసేనలో చేరాలనుకున్నారు. పవనే తనకు కండువా వేసేందుకు ఒంగోలు రావాలని కోరుకున్నారు. కానీ అది కుదరలేదు.
గురువారం బాలినేని ఒక్కరే ఒంటరిగా మంగళగిరి బయల్దేరారు. వారి వెంట కొడుకు ప్రణీత్‌రెడ్డి ఉన్నారు. సాయంత్రం 4:30కి పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు ప్రముఖ వ్యాపారవేత్త కూడా నేడు జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం.