మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కేసులను తప్పించుకోవటానికి జనసేనలో చేరుతున్నారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. ఒంగోలులో గురువారం దామచర్ల మాట్లాడుతూ జనసేనలో బాలినేని చేరిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆయనతోపాటు, కొడుకు ప్రణీత్ పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ముందు తనపై, టిడిపి శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.