ఇప్పుడు నెయ్యి నాణ్యతపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చూస్తే.. అవన్నీ ఆయన పదవిలోకి వచ్చిన తర్వాతే సరఫరా అయ్యాయని కొడాలి నాని గుర్తు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... అయితే అది తమ ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ నిందించారని, రాజకీయం చేసి శ్రీవారి ఆలయంతో పాటు, రాష్ట్ర ప్రతిష్టను కూడా దిగజార్చారని ఆక్షేపించారు. జగన్‌గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న దుర్భుద్ధితో చివరకు శ్రీవారి ప్రసాదాన్ని కూడా రాజకీయల్లోకి లాగిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. ఇది చాలా పెద్ద కుట్ర కాబట్టి, అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ, జగన్‌గారు ప్రధానమంత్రి, సీజేఐకి లేఖ రాస్తే, చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు.