టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు నగరంలోని 45 వార్డు లేబర్ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కార్పొరేటర్ మాణిక్యమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు, పవన కళ్యాణ్, బీజేపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సేవ చేయడంలో జవాబుదారీగా వ్యవహరిస్తోందని అ న్నారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన, ముంతాజ్, జయన్న పాల్గొన్నారు.