ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం లావేరు పరిధిలోని బెజ్జిపురంలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించి వివరించారు. కూటమి నాయకులు సురేష్, శ్రీనివాసరావు, మధుబాబు, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.