కర్నూలు జిల్లా, కోసిగి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ నాయకుడు ఎన్. రాఘవేంద్రరెడ్డి అన్నారు. గురువారం కోసిగిలో సర్పంచ్ అయ్యమ్మ, ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ఎంపీ మాట్లాడుతూ కోసిగి అక్షరాస్యత, అభివృద్ధి వెనుకబడిందని, స్థానిక ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులను గెలిపించాలని కోరారు.
అనంతరం మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పరిశీలించి ప్రిన్సిపాళ్లను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. డీఈవో శామ్యూల్, తహసీల్దార్ నిత్యానంద రాజు, జనసేన ఇన్చార్జి వాల్మీకి లక్ష్మన్న, బీజేపీ ఇన్చార్జి విష్ణువర్దన్ రెడ్డి, బీజేపీ రాముడు, రాకేష్, నాడిగేని అయ్యన్న, తాయన్న, జ్ఞానేష్, మాజీ జడ్పీటీసీలు తోవి రామకృష్ణ, వెంకటేశ్, చింతలగేని నర్సారెడ్డి, వక్రాణి వెంకటేశ్ పాల్గొన్నారు.