బాపట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1లక్ష 116 చెక్కును బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోళ్ళపూడి శివరామ ప్రసాద్, సెక్రెటరి పి. వి. రంగారావు, నల్లమల్లి శ్రీనివాసరావు, జి. వి. వి ఆంజనేయులు, టి. గురు బ్రంహ్మం, డి. వి. సుబ్రహ్మణ్యం అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.