రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు రావాలని ఆహ్వానం అందింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులతో వెళ్లి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంద్రకీలాద్రి పై జరిగే దసరా ఉత్సవాలకు రావాలని ఆహ్వానం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa