శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం,లోలుగు గ్రామంలో సోమవారం విషాదం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జడ్డు వరహాలమ్మ (93) తన అల్లుడు లోలుగు సూర్యనారాయణ ఇంట్లో ఉంటోంది. భర్తతో పాటు ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో సూర్యనారాయణ అన్ని తానై చూసుకుంటున్నాడు.
వరహాలమ్మకు చుట్ట కాల్చడం అలవాటు ఉంటి. సోమ వారం ఎప్పటిలాగానే చుట్ట కాల్చుతుండగా జారి వంటిపై ఉన్న దుస్తులపై పడింది. ఫ్యాన్‌గాలికి ఆ చుట్ట నుంచి మంటలు చెలరేగి దుస్తులకు అంటుకున్నాయి. ఒక్క సారిగా మంటలు పెద్దవై శరీరానికి అంటుకున్నాయి. కుటుంబసభ్యులు గుర్తించే లోపే 90 శాతం శరీరం కలిపోయింది. సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.సత్యనారాయణ, ఏఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు.