రైతు కుటుంబాల అభున్నతే లక్ష్యంగా సహకార సంఘాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అందుబాటులోకి తెచ్చాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కేడీసీసీ బ్యాంకు జిల్లా పర్సన్ ఇన్‌చార్జి హరనాథ్‌బాబు తెలిపారు. హనుమాన్‌జంక్షన్ పరిధిలోని రంగన్నగూడెం పీఎసీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మహాజన సభలో ఆయన పాల్గొన్నారు.
సహకార సంఘాల్లో సభ్యులైన వారి కుటుంబాల్లోని విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు రుణాలు అందించాలని రైతులు కోరారు. రైతుల వినియోగం కోసం సంఘ పరిధి లోని సింగన్నగూడెంలో 50మెట్రిక్‌టన్నుల గోడౌన్ నిర్మించాలని, సంఘ అభివృద్ధికి దాతలు విరాళంగా ఇచ్చిన రూ.7.7లక్షల నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిం చాలని, స్థల దాత ఆళ్ల రామయ్యభవన్‌గా పీఎసీఎస్ భవనానికి నామ కరణం చేయాలని ఆళ్ల గోపాలకృష్ణ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సంఘ పరిధిలో శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, రైతులకు గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణానికి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కసుకుర్తి రంగామణి కోరారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ మాజీ అధ్యక్షు డు తుమ్మల దశరధరామయ్య, పాలసొసైటీ అధ్యక్షుడు మొవ్వా శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, టీడీపీ అధ్యక్షులు మొవ్వా వేణుగోపాల్, కొండపల్లి వెంకన్న, మైనేని కృష్ణారావు, దోనవల్లి హరిబాబు, తుమ్మల సత్యనారాయణ, మొక్కపాటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.