గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గాంధీ జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని చికెన్, మటన్ దుకాణాలు మూతపడ్డాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చికెన్, మటన్ దుకాణాల నిర్వహకులకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.
దీంతో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా చికెన్, మటన్ దుకాణాలను నిర్వాహకులు మూసి వేశారు. మాంసపు దుకాణాలను ఎవరైనా తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.