పెత్తర్ల అమావాస్య పండుగ సందర్భంగా బుధవారం గుత్తి పట్టణంలోని కిరాణా దుకాణాల వద్ద ప్రజలు పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు రావడంతో మెయిన్ బజార్ ప్రజలతో కిటకిటలాడింది.
సంవత్సరానికి ఒకసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే ఈ పెత్తర్ల అమావాస్యకు ఉపయోగించే పూజా సామాగ్రి వస్తువులు కొనేందుకు దుకాణాల వద్ద ప్రజలకు క్యూ కట్టారు. దీంతో గాంధీ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.