విజయవాడ నగరపాలక సంస్థ అధ్వర్యంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం బెంజ్‌సర్కిల్ వద్ద పింక్ టాయిలెట్స్‌పై కలెక్టర్ సృజన, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నగరపాలక కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ... గాంధీజీ ఆశయం స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత వల్ల ఆరోగ్యానికే కాదు నగరానికి తద్వారా రాష్ర్టానికి తద్వారా దేశానికి పరిశుభ్రమైన దేశంగా గర్వకారణమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 1 వరకు నిరంతరాయంగా ప్రతిరోజు స్వచ్ఛతా హీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వ్యాసరచన, వ్యక్తిత్వ, డ్రాయింగ్ పోటీలు, గోడలమీద పెయింటింగ్, మొక్కలు నాటడం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు పింక్ టాయిలెట్స్ ఎలా ఉపయోగపడతాయి వాటి ప్రాముఖ్యతను కలెక్టర్‌తో పంచుకొన్నారు.