శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, తన మార్క్ కనిపించేలా జిల్లాలో అభివృద్ధి చేసి చూపెడతానని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం కోదూరు పంచాయతీలో రూ.2.30 కోట్లతో నిర్మిం చనున్న పీఎం జన్‌మన్ వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. ఆలాంధ్రరోడ్ కూడలి సమీ పంలో బహిరంగ సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు స్థల సేకరణకు కృషి చేస్తున్నామన్నారు. ఒక రంగంలో అభివృద్ధి జరిగితే దానికి అను సంధానంగా పలు అభివృద్ధి పనులు జరుగుతాయని, ఈ దిశగా చర్యలు తీసు కుంటున్నామన్నారు. వలసల నివారణకు దోహదపడుతుం దన్నారు.
విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల కార్పొరేషషన్ ఏర్పాటు చేయనున్నామన్నారు. వైసీపీ హయాంలో పాలన అంతా ఛిన్నాభిన్నమైందని, దీనిని చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు మాట్లాడుతూ.. జిల్లాను సమగ్రా భివృద్ధి చేస్తామన్నారు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలతో రాష్ట్రంలో 80 శాతం ప్రజానీకానికి సేవచేసే అవ కాశం తనకు కలిగిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతీహామీని అమలు చేస్తామన్నారు. పాతపట్నం నియోజక వర్గం అత్యం త వెనుకబడినందున ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. జనమన్ వసతి గృహాలు రెండు ఈ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎన్నికల హామీలో భాగంగా జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మూలపేటలో పోర్టు ఏర్పాటు చేసి ఏడాదిలో నౌకలు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల ఉపాధి అవకా శాలు పెరిగి నిరుద్యోగ సమస్య పరి ష్కారమవుతుందన్నారు. పాతపట్నంలో ఐటీఐ ఏర్పాటు, 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత దుస్తులపై ఉన్న జీఎస్‌టీ తొలగించే దిశలో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లా డుతూ.. నియో జకవర్గ అభివృద్ధికి మంత్రుల తో పాటు కలెక్టర్ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్, వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.