పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది అంటూ ఎద్దేవా చేశారు .సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా పవనానంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. కల్లు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.
భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం, దారుణ అనైతిక విమర్శలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవన్ విమర్శలు, ఆరోపణలకు థీటుగా బదులిచ్చిన భూమన, డిప్యూటీ సీఎం గతి తప్పి మాట్లాడారని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌కళ్యాణ్‌కు చురకలంటించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వచ్చారన్న భూమన కరుణాకర్‌రెడ్డి, 14 ఏళ్లుగా తన కుమార్తెలను ఒక్కసారి కూడా దైవ దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్ అని గుర్తు చేశారు. హిందూ సనాతన ధర్మ ఆచారకులు పిల్లలకు 9 నెలలకే తల నీలాలు తీయిస్తారన్న ఆయన, అలా చేయని పవన్‌కళ్యాణ్ ఇప్పుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడయ్యాడని, డిక్లరేషన్‌పై సంతకం చేస్తూ తిరుమలలో కనిపించారని వ్యాఖ్యానించారు. పవన్‌కళ్యాణ్ తీరు ఎలా ఉందంటే.. కెవ్వుకేక అనే పాట గుర్తొస్తుందన్న భూమన.. సరిగ్గా ఆ కెవ్వు కేక బాబాజీలా పవనస్వామి వ్యవహరించారని చెప్పారు.
తాను ఈ సభలో రాజకీయాలను మాట్లాడను అని ప్రసంగం ప్రారంభించిన పవనస్వామి, తమ పార్టీపైనా, తమ నాయకుడు శ్రీ వైయస్ జగన్‌పైనా పిచ్చిగా రాజకీయ ప్రేలాపనలు చేశారని.. అంత కంటే ఇంకా దిగజారి ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా హెచ్చరికలు జారీ చేశాడని టీటీడీ మాజీ ఛైర్మన్ తెలిపారు.‘కల్లు తాగిన కోతి ఏరకంగా ఎగురుతుందో సనాతన ధర్మం కోసం పవనస్వామి మాటలు అలానే ఉన్నాయి’.. అని ఆయన వ్యాఖ్యానించారు. జీవితంలో ఏనాడూ ధర్మం, హైందవం కోసం మాట్లాడని పవన్‌కళ్యాణ్, తిరుపతి సభలో అవే మాట్లాడడం వెనక ఎజెండా ఉందని అర్థమవుతోందని భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.