ఉరవకొండ పట్టణంలోని గుంతకల్లు రోడ్డు వద్ద వెలసిన శ్రీ జగదీశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్న నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
రెండవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం ఆలయ ధర్మకర్త గాజుల శ్యామల ఆధ్వర్యంలో రుద్ర సహిత మహా చండీ హోమం, నవదుర్గ హోమం నిర్వహించారు. వందలాది మంది భక్తాదులకు అన్నదాన కార్యక్రమం ధర్మకర్త చేతుల మీదుగా ప్రారంభించారు.