సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైయస్ఆర్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. లడ్డూపై కేవలం దురుద్దేశ పూర్వకంగా చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే నమ్మకం ఉందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలతాయని, సత్యం వెలుగులోకి వస్తుందని భూమన అన్నారు.