తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. రోజుకు 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చని వెల్లడించారు. 18 వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చని తెలిపారు. తరిగొండ వెంగమాంబ, అక్షయ, వకుళమాత వంటశాలలతో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని... శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్ లు ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది... ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుడి సన్నిధిలో అన్నదానం జరుగుతోంది. నాడు రెండు, మూడు వేల మందితో ప్రారంభమై నేడు 3 లక్షల మందికి అన్నదానం జరుగుతోంది. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత క్రమబద్ధీకరణ చేస్తాం. క్యూ లైన్ల నిర్వహణను కూడా రిగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత, మేనేజ్ మెంట్ లో కూడా మార్పు వచ్చింది. దీంతో భక్తులు హర్షిస్తున్నారు’’ అని సీఎం అన్నారు.