వ్యవసాయం దండగ అని చెప్పే చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పంటల దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ ఖరీఫ్ సీజన్ చెబుతోంది అని వైసీపీ నాయకులు వాపోతున్నారు. వారు మాట్లాడుతూ..... చంద్రబాబు ప్రభుత్వం సాగులో రైతులకు అండగా ఉండకపోవడం.., విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించకపోవడం.., ఉన్న సౌకర్యాలను కూడా తొలగించడం, అతివృష్టి, అనావృష్టికి తగ్గట్లుగా పంటల ప్రణాళిక రచించకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతింది అని వైసీపీ నాయకులు వాపోతున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరిచేయగా, వాటికి మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ఫలితంగా 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంతో ప్రారంభమైన ఈ సీజన్ చివరికి 69.70 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఎన్నడూ లేని రీతిలో 15.95 లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉండిపోయాయి. ఆరు లక్షల ఎకరాల్లో పంటలు వర్షాలు, వరదలతో పనికిరాకుండా పోయాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తొలకరిలో మంచి వర్షాలే కురవడంతో సాగుకు తిరుగుండదని రైతులు ఆశించారు. జూన్ నుంచి సెపె్టంబర్ మధ్య 574.70 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, రికార్డు స్థాయిలో 689 మిల్లీమీటర్లు కురిసింది. దీంతో రైతులు ఉత్సాహంగా పంటలు వేశారు. జూలై, సెపె్టంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోపక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాయలసీమలో రైతులను దెబ్బతీశాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, అందుకు తగిన సహకారంతో ముందుకు రావాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేకపోవడంతో లక్షలాది ఎకరాల్లో రైతులు సాగుకు దూరమయ్యారు. సాగైన ప్రాంతాల్లో సైతం ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే పరిస్థితి లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు అని అన్నారు.