శుక్రవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తోందని, తాము గెలిస్తే బ్లడ్ బుక్ రాస్తామని గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి హెచ్చరించారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్రెడ్డి కూడా కార్యకర్త మాదిరిగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు ప్రసంగించారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైయస్ఆర్సీపీ కేడర్‌కు మనోధైర్యాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లే సత్తా అంబటికి, మోదుగులకు ఉందన్నారు. పార్టీకి దూరమైన వారిని కూడా దగ్గర చేసే దిశగా ప్రతి ఒక్కరూ సాగాలని పిలుపునిచ్చారు.