తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిలో ప్రశాతంతకు భంగం కలగకూడదు తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని కుండబద్దలు కొట్టారు. పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.