కమలాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 8 మంది బాధిత కుటుంబాలకు కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి సీఎం సహాయ నిధి నుండి చెక్కులను సోమవారం కడపలో పంపిణీ చేశారు. కమలాపురం, వల్లూరు, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె మండలాలకు చెందిన ఎనిమిది మంది బాధితులకు రూ. 10, 78, 685 చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యం బారిన పడిన, చికిత్స పొందిన వారికి పరామర్శించి ఆరోగ్య స్థితి గతులను కనుక్కున్నారు