గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, గుత్తి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం వార్డులో ఉన్న రోగులకు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వారు వైద్యులకు సూచించారు.