ఉరవకొండ మండలంలోని బూదగవి గ్రామంలో గౌరసంద్రం మారెమ్మ ఆలయ 55వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఆశ్వీయుజ మాసం శుద్ధ పంచమి సోమవారం అమ్మవారి జల్ది బిందెపూజ నిర్వహించబడింది.
ఉరవకొండ నుండి ఆలయం వరకు భారీ ఊరేగింపు జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన మూలవిరాట్నకు పూజలు చేశారు. మధ్యాన్నం అన్నదానం, రాత్రి భజన కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం కుంభారాధన, గ్రామోత్సవం, గుఱ్ఱముల ఆటలు కొనసాగుతాయని ఆలయ కమిటీ తెలిపారు.