ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కేంద్రం ఇటీవల సకాలంలో రూ. పదకొండు వందల కోట్లు ఇవ్వకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈపాటికి అమ్మకానికి వెళ్లేదన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘నేను మంగళవారం కూడా కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి మాట్లాడాను. ఉక్కు పరిశ్రమ సెంటిమెంట్‌ను చెప్పాను. దాని కాళ్లపై అది ఎలా నిలబడాలనేదానిపై చర్చించాం.
కానీ దానికి స్పష్టమైన సమాధానం లభించలేదు. పాలనా వైఫల్యా లు, సరైన యాజమాన్య పద్ధతు లు అవలంబించకపోవడం దెబ్బ తీశాయి. గత ఐదేళ్లు దాని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ఇప్పుడు దానిని పునరుద్ధరించడానికి ఎంత డబ్బు కావాలి...ఏం చేయాలన్నదానిని చర్చిస్తున్నాం. రెండు కమిటీలు పరిశీలన చేస్తున్నాయి. ప్రాక్టికల్‌గా ఏది సాధ్యమో చూసుకోవాలి. మేం శక్తివంచన లేకుండా చేస్తున్నాం. నిపుణులు దీనిపై సలహాలు ఇవ్వాలి’ అన్నారు.