ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ అటవీశాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి కాకినాడ డీఎఫ్ఓగా పనిచేస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్ పేరు చెబుతూ మైనింగ్, అటవీశాఖ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. పవన్ కల్యాణ్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పుకుంటున్నట్టు తెలిసింది. తాను చెప్పినప్పుడు మాత్రమే మైనింగ్ వాహనాలు బయటకు కదలాలని అధికారులకు రవీంద్రనాథ్ రెడ్డి హుకుం జారీ చేసిన విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో, రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరపాలంటూ పవన్ ఆదేశాలు జారీ చేశారు.