బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఆదివారం ఆయన వెబెక్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు. తుఫాన్ వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.