గత ప్రభుత్వ హయాంలో నగరంలో అనేక సెటిల్మెంట్లకు పాల్పడిన, యూఎల్ సీ కింగ్గా పేరొందిన వ్యక్తి ఇందులో భారీగా లబ్ది పొందారు. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ లో ఆప్పటి సబ్ రిజిస్టర్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దసపల్లా భూముల వ్య వహారంలో వేలకోట్ల లావాదేవీలపై గత ప్రభుత్వ హయాంలో ఆప్పటి విపక్ష టీడీపీ, జనసేన నేతలు వేర్వేరుగా పోరాటాలు చేశారు.
కూటమి అధికారం చేపట్టిన తరువా త గత నెలలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా దసపల్లా భూములను సందర్శించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన దర్బార్లో ఈ భూములపై కొంతమంది ఆయనకు ఫిర్యాదుచేశారు. విశాఖలో భూముల దోచుకున్న వ్యవహారం పై సమగ్రంగా విచారణ చేయాలనే ఆలోచనతో దసపల్లా భూములపై ప్రభుత్వం ని వేదిక కోరింది. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై జిల్లా యంత్రాం గం నివేదిక సిద్ధంచేసి పంపనున్నది.