ఎలమంచిలి మండలం ములకలాపల్లిలో గల మహా సిమెంట్ కంపెనీ అధికారులపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ కోసం ఈ ప్రాంతంలోని రైతులు భూములు ఇవ్వడంతో పాటు కాలుష్యాన్ని భరిస్తున్న వారికి ఏం చేశారని ప్రశ్నించారు. అద్వాన్న స్థితిలో ఉన్న సిమెంట్ రోడ్డుకు కనీసం మరమ్మతులు చేయించలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ముందు ఉన్న విద్యుత్ లైట్లు వెలగడం లేదన్నారు.