గంగవరం మండలం లకొండ సచివాలయాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవీ, తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. సచివాలయంలో ఉన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను అర్హలందరికి వర్తింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగవరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుంజం సిద్దు ఉన్నారు.