గత ప్రభుత్వం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం పల్లెలను ప్రగతి పథంలోనికి తీసుకెళ్తుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు మండలం పరిధిలో అభివృద్ధి పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు. ఖాళీ ఖజానాతో అధికారం చేపట్టి వీధిలైట్లకు కూడా నోచుకోని గ్రామపంచాయతీలను కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం చంద్రబాబుదే అని ఆమె అన్నారు.