ఉరవకొండ పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, రాఘవేంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత నర్రా కేశన్న తనయుడు నర్రా చైతన్య (23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
బెంగళూరులో శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చైతన్య ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. విషయం తెలియగానే వారి తల్లిదండ్రులు, పలువురు టీడీపీ నేతలు ఉరవకొండ నుంచి హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు.